పీఎం కిసాన్ 2026 డబ్బులు వచ్చేశాయి | PM Kisan Status Check Telugu

పీఎం కిసాన్ అమౌంట్ రిలీజ్ 2026: రైతుల ఖాతాల్లోకి రూ.2000 .స్టేటస్ చెక్ చేసుకోండిలా.

దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక ఆసరా అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan). ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున మూడు విడతల్లో (ఒక్కో విడతకు రూ. 2,000) నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది.

2026 సంవత్సరానికి గానూ మొదటి విడుత మీ అకౌంట్ జమ కావడం జరిగింది  , మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయో లేదో ఎలా చెక్ చేసుకోవాలి వంటి పూర్తి వివరాలు మనం తెలుగు లో  తెలుసుకుందాం.

 

2026లో పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు విడుదల అవుతాయి?

సాధారణంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులనుఎలా  విడుదల చేస్తుంది. 2026 సంవత్సరానికి సంబంధించి నిధుల విడుదలకు సంబంధించిన అంచనా షెడ్యూల్ ఈ కింది పట్టికలో చూడవచ్చు:

విడత (Installment) విడుదలయ్యే కాలం (అంచనా) జమ అయ్యే మొత్తం
మొదటి విడత మార్చ్  – జూలై రూ. 2,000
రెండవ విడత ఆగస్టు – నవంబర్ రూ. 2,000
మూడవ విడత డిసెంబర్  రూ. 2,000

 

ఈ-కేవైసీ (e-KYC) పూర్తయిందా లేదా చెక్ చేసుకోండి!

మీ ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే ఈ-కేవైసీ (e-KYC) మరియు ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింకింగ్ తప్పనిసరి. మీరు ఇంకా e-KYC పూర్తి చేయకపోతే, వెంటనే మీ దగ్గరలోని సీఎస్‌సీ (CSC) సెంటర్‌ లేదా మీసేవ కి వెళ్లి లేదా పీఎం కిసాన్ పోర్టల్‌లో చెక్ చేసుకోండి

మీ పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి:

  1. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in కు వెళ్లండి.
  2. హోమ్ పేజీలో కుడివైపున ఉన్న ‘Farmers Corner’ సెక్షన్‌లో ‘Know Your Status’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. అక్కడ మీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను నమోదు చేయండి. (రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే, అక్కడే ఉన్న ‘Know your registration no.’ పై క్లిక్ చేసి మొబైల్ నెంబర్ లేదా ఆధార్ ద్వారా తెలుసుకోవచ్చు).
  4. స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యాప్చా (Captcha) కోడ్ ఎంటర్ చేయండి.
  5. ‘Get Data’ బటన్ పై క్లిక్ చేయండి.
  6. అప్పుడు మీకు పీఎం  కిసాన్ registaion నెంబర్ వస్తుంది ఆ నెంబర్ ని కాపీ చేసుకోండి . మల్లి పీఎం కిసాన్ పోర్టల్ కి వచ్చి స్టేటస్ అనే ఆప్షన్ ఉంటది అందులో మీరు కాపీ చేసి చేసిన నెంబర్ పేస్ట్ చేస్తే మీ అకౌంట్ లో అమౌంట్ ఆడ్ ఐద లేదా చూపిస్తుంది

 పీఎం కిసాన్ అమౌంట్ రవళి అంటే ఈ క్రింద ఉన్నాయి తప్పనిసరిగా చేసి       ఉండాలి  

పీఎం కిసాన్ అమౌంట్ రవళి అంటే ఫాస్ట్ మీరు పీఎం కిసాన్ ekyc పూర్తి చేసికొని ఉండాలి అది కూడా ఎలా చేసుకోవాలి అనే వీడియో మీరు పూర్తిగా చూసి చేసుకోండి విడియో

క్రింద ఇవ్వడం జరిగింది .

అంతే కాకుండా ఫార్మర్ regstion కూడా మీరు చేసుకొని ఉండాలి 2026 లో ఫార్మర్ regstion ఎలా చేసుకోవాలి అనేది మీరు ఏ క్రింద ఉన్న వీడియో చద

డం వాళ్ళ మీరు చేసుకోవచ్చు 

డబ్బులు రాకపోతే ఏం చేయాలి?

ఒకవేళ మీ స్టేటస్ అంతా సరిగ్గానే ఉండి, డబ్బులు గనుక రాకపోతే మీరు పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు:

  • టోల్-ఫ్రీ నెంబర్లు: 155261 లేదా 1800115526 లేదా 011-24300606
  • ఈ-మెయిల్: pmkisan-ict@gov.in

ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్స్ తెలుసుకోవడానికి పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌ను క్రమం తప్పకుండా సందర్శించండి.

 

                                                   సపోర్ట్ చేయాండి ధన్యవాదాలు 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *