నివాస ధ్రువీకరణ పత్రం లేదా Residency Certificate అనేది మనం ఒక ప్రాంతంలో నివసిస్తున్నామని చెప్పడానికి ప్రభుత్వం ఇచ్చే ముఖ్యమైన పత్రం. ఇది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ కోసం, ఉద్యోగాల కోసం మరియు ఇతర ప్రభుత్వ పథకాలకు ఈ రెసిడెన్సీ సర్టిఫికెట్ చాలా అవసరం.

1. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు (Required Documents)
మీరు మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసే ముందు ఈ క్రింది డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోండి:
- అప్లికేషన్ ఫారమ్: మీసేవ కేంద్రంలో దొరుకుతుంది లేదా ఆన్‌లైన్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఈ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి CLICK HEAR
- ఆధార్ కార్డ్: అడ్రస్ ప్రూఫ్ కోసం.
- రేషన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి: అదనపు గుర్తింపు కోసం
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
2. దరఖాస్తు చేసుకునే విధానం (Step-by-Step Process)
మీకు మీ దగరలో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రింది పద్ధతుల ద్వారా .
స్టెప్ 1: ముందుగా మీసేవ అప్లికేషన్ ఫారమ్‌ను పూరించండి. ఇందులో మీ పేరు, తండ్రి పేరు, పూర్తి చిరునామా మరియు సర్టిఫికెట్ దేనికోసం కావాలో స్పష్టంగా రాయాలి.
స్టెప్ 2: పైన చెప్పిన డాక్యుమెంట్లను అప్లికేషన్ ఫారమ్‌కు జత చేయండి.
స్టెప్ 3: మీసేవ ఆపరేటర్ మీ వివరాలను సిస్టమ్‌లో నమోదు చేసి అనగా అప్లై చేసి , డాక్యుమెంట్లను స్కాన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది
స్టెప్ 4: అప్లికేషన్ ఫీజు 45/- రూపీస్ చెల్లించిన తర్వాత, మీకు ఒక Acknowledgement Receipt (రసీదు) ఇస్తారు. ఇందులో ఉండే Transaction ID చాలా ముఖ్యం.
స్టెప్ 5: మీ దరఖాస్తును మీ తాసిల్దార్ ఆఫీస్ లో ఇవ్వాలి మీ ఫరొమ్ ఇచ్చిన తరువాత మీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO) మరియు తహసీల్దార్ (MRO) పరిశీలిస్తారు. అన్నీ సరిగ్గా ఉంటే సర్టిఫికెట్ అప్రూవ్ చేస్తారు.
మీరు నివాస ధ్రువీకరణ పత్రం (Residency Certificate) అప్లై చేసే పద్ధతి hello sree యూట్యూబ్ ఛానల్ లో చూడవచ్చు మరియు ఏ క్రింద ఉన్న వీడియో ద్వారా కూడా చూడవచ్చ
3. అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడం ఎలా?
మీ సర్టిఫికెట్ ఏ దశలో ఉందో ఈ పద్ధతుల ద్వారా తెలుసుకోండి
- MeeSeva Official Website కి వెళ్లండి. ఈ లింక్ ని క్లోక్ చీయండి CLIK HEAH
- ‘Check Statues’ సెక్షన్‌లో మీ ట్రాన్సాక్షన్ ఐడిని ఎంటర్ చేయండి.
- మీ సర్టిఫికెట్ అప్రూవ్ అయితే, మీరు తిరిగి మీసేవ కేంద్రానికి వెళ్లి ప్రింట్ తీసుకోవచ్చు.
ముగింపు:
సాధారణంగా దరఖాస్తు చేసిన 7 లోపు నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేయబడుతుంది. గడువు ముగియకముందే మీరు దరఖాస్తు ను మల్లి ఒకసారి తాసిల్దార్ ఆఫీస్ లేదా మీసేవ కి వెళ్లి చెక్ చేసుకోవడం మంచిది
నివాస ధ్రువీకరణ పత్రం ఎలా అప్లై చేయాలి అనే పద్థతి తెలుగు లో ఇవ్వడం జరిగింది అలాగే ఒక్క వీడియో ద్వారా కూడా మీకు ఇవ్వడం జరిగింది
ఇదే కంటెంట్ ఇంగ్లీష్ లో కావాలి అంటే ఈ వెబ్సైటు లింక్ CLICK HEAR ని క్లిక్ చేసి ఇంగ్లీష్ లో కూడా మీరు చదవ వచ్చు
ధన్యవాదాలు
